బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ మంత్రి అయ్యారన్నారు. నీతి నిజాయితీ కి మారు పేరు వెంకట్ రెడ్డి అని అన్నారు. తనపై అవినీతి మరకే లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండను పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు వచ్చాడని ఫైర్ అయ్యారు. తన గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కే లేదని.. బచ్చా కేటీఆర్ ఎంత అంటూ దుమ్మెత్తి పోశారు. లక్షల కోట్ల అవినీతి.. ఈ కార్ రేస్ తప్పా బీఆర్ఎస్ దగ్గర ఏమీ లేదన్నారు. తన దగ్గర లక్షల కోట్లు లేవన్నారు. కానీ, ప్రజల అండదండలు మాత్రం ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: KTR Vs Komatireddy: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!
హరీష్ రావు మామ చాటు అల్లుడని.. కేటీఆర్ తండ్రి చాటు కొడుకని ఎద్దేవా చేశారు. ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. పీసీసీ ఆదేశాలతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. గద్దర్ పై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి.
ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఉన్నాడా?
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా లేక బండి సంజయ్ ఉన్నాడా? అని ప్రశ్నించారు. అణగారిన ప్రజల కోసం గజ్జె కట్టి పాట పాడి గద్దర్ ఉద్యమం చేసిండన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ మూసి చేయొద్దంటా, అక్కడ యమున మాత్రం ప్రక్షాళన చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. మూసీ క్లీన్ చేస్తాం అంటే... అక్కడికి పోయి బీజేపీ నాయకులు ఏసీ రూమ్ లలో పడుకున్నారన్నారు.
Komatireddy Vs KTR: కేటీఆర్ ఓ బచ్చా.. నా కాలి గోటికి కూడా సరిపోడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తన గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు కూడా లేదని.. కేటీఆర్ ఓ బచ్చా అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. అధికారంలో ఉన్న సమయంలో నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ఫైర్ అయ్యారు.