/rtv/media/media_files/y8dsYa1WwstMI3ehHUNx.jpg)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఈ రోజు నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా చెరుకు శ్రీనివాస్ రెడ్డిని స్టేజీపై ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఫైర్ అయ్యారు.
అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం శ్రీనివాస్ రెడ్డి స్టేజీపైనే ఉంటాడని స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదాలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. నర్సాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అనేక సార్లు ఆందోళన చేపట్టారు.
కొండా సురేఖకు రఘునందన్ సన్మానం..
ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండా సురేఖకు బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక నేతన్నలు తయారుచేసిన నూలు పోగుతో స్వాగతం పలికారు. దుబ్బాక అంటేనే చేనేత నేతన్నలని.. వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రిని ఎంపీ కోరారు. వారి జీవితాలలో వెలుగు నింపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్