/rtv/media/media_files/2026/04/12/inter-2026-04-12-11-39-00.jpg)
Telangana: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆదివారం విడుదల చేశారు. ఈ ఏడాది జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 70.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించడం విశేషం.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు:
మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 3,23,807 మంది పాసయ్యారు.
మొత్తం ఉత్తీర్ణత శాతం: 66.02%
బాలికల ఉత్తీర్ణత: 74.4%
బాలుర ఉత్తీర్ణత: 57.69%
Also Read: ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణాలు ఇవే!
ఇంటర్ సెకండియర్ ఫలితాలు:
రెండవ సంవత్సరం పరీక్షలకు 5,07,948 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,58,490 మంది విజయం సాధించారు.
మొత్తం ఉత్తీర్ణత శాతం: 70.58%
బాలికల ఉత్తీర్ణత: 78.65%
బాలుర ఉత్తీర్ణత: 62.5%
Vishnupriya: డబ్బుల కోసం దిగజారుతావా.. యాంకర్ విష్ణుప్రియపై పోలీసులకు ఫిర్యాదు
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే అత్యంత పారదర్శకంగా ఫలితాలను విడుదల చేసిన బోర్డు అధికారులను ఈ సందర్భంగా ప్రభుత్వం అభినందించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూనే, ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు అధైర్యపడకుండా త్వరలో నిర్వహించబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
ఇటు సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు ఖరారు చేసింది. తమకు వచ్చిన మార్కులపై ఏవైనా సందేహాలు ఉన్నా లేదా తక్కువ మార్కులు వచ్చాయని భావించినా విద్యార్థులు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విండో ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గడువులోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలను కూడా వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20వ తేదీ లోపు పరీక్షా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎంతో కీలకమైన ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలను ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
కేవలం థియరీ పరీక్షలే కాకుండా ప్రాక్టికల్ పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ రాసే విద్యార్థులకు మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతాయి. ఇవి కూడా థియరీ పరీక్షల మాదిరిగానే రెండు సెషన్లలో జరుగుతాయి.
Follow Us