పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల పాప వితన్య రెడ్డిని కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపింది. అనంతరం సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. సాహితీ భర్త LICలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
ప్రియుడి కోసం భర్తను..
ఇదిలా ఉండగా ఇటీవల పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.
ఇది కూడా చూడండి: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.
ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్‌లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్‌తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు.