సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

TG: హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

New Update
revanth3

Hydra: హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ తీసుకొచ్చిన హైడ్రాపై హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ!

అధికారం ప్రభుత్వానికి  లేదు...

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఈ నెల 3న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ప్రజా ప్రయోజన (Public interest litigation) పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హైడ్రాకు విస్తృతాధికారాలు లభించాయని, జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 374 బి ద్వారా లభించే అధికారాలను ఆర్డినెన్స్‌తో హైడ్రాకు కట్టబెట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్టా చట్టం కింద కలెక్టర్, ఎమ్మార్వోలకు లభించే అధికారాలను హైడ్రాకు బదలాయించిందని కోర్టుకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా చేసే అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ధర్మాసనాన్ని కోరగా.. హైడ్రాను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నో చెప్పింది. ప్రతివాదులైన రాష్ట్ర సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. కాగా హైడ్రాపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.  

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు