/rtv/media/media_files/2024/11/15/kZwI5ULb4XVKc0qZJdmr.jpg)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఇంటి భోజనం అనుమతించాలని ఆదేశాల్లో పేర్కొంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నారు. మరో వైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.
Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!?
కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న పోలీసులు..
అయితే.. నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కస్టడీ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. మరో వైపు ఆయన కస్టడీ పిటిషన్ పై విచారణను కొడంగల్ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రేపు ఈ అంశంపై విచారణ జరగనుంది.
Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?
ఈ కేసును మరింత లోతుగా విచారించే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు. మరోవైపు ఈ కేసులో మరో కీలక నిందితుడైన సురేష్ ఇంత వరకు పోలీసులకు దొరకలేదు. ఆయనను పట్టుకునేందుకు పలు పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.
Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్!
మరోవైపు కలెక్టర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే పరిగి డీఎస్పీపై వేటు వేసింది. డీజీపీ ఆఫీసుకు ఆయనను అటాచ్ చేసింది. ఒకట్రెండు రోజుల్లో మరింత మంది అధికారులపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..
(kishan-reddy | telugu-news | telugu breaking news | latest-telugu-news)
Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
YS sharmila: తల్లితో పాటు మేనల్లుడికి కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!
Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!
Viral Video: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?
Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు