/rtv/media/media_files/2025/11/20/danam-nagendar-likely-to-resign-from-mla-post-2025-11-20-14-33-52.jpg)
Danam nagendar likely to resign from MLA post
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై దాఖలైన పిటిషన్ తాజాగా హైకోర్టులో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం .. ఆ తర్వాత పార్టీ మారడం, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఏలేటి పలు కీలక అంశాలను కోర్టు ముందుంచారు.
ఏలేటి డిమాండ్
బీఆర్‌ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీలో చేరడం అనర్హతకు దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇతర పార్టీ నుంచి లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచే ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఏలేటి డిమాండ్ చేశారు. కర్ణాటక, బిహార్ వంటి రాష్ట్రాల్లో పార్టీలు మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను ఈ పిటిషన్‌లో ఉదాహరణగా చూపారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తమ వాదనలను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Follow Us