/rtv/media/media_files/2025/02/09/EaM787uaElOdeev6dmZ8.jpg)
indiramma
ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5 లక్షల మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై తెలంగాణ సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. కాగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీనిప్రకారం ఎల్-1లో 21.93 లక్షలు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. జీహెచ్‌ఎంసీలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71 వేల 482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Also read : Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!
ఎలక్షన్ కమిషన్ వివరణ
మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
ఇక మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని తెలిపింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయాలని మీసేవను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు మీసేవ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.
Also Read : నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!
BREAKING: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court Key Comments on HCU Lands
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంతువులు షెల్టర్ అక్కడ తిరగడం షాకింగ్‌గా ఉందని ఉందని తెలిపింది. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందకు వచ్చిందని నిలదీసింది. మీరు చెట్లు నరికివేయడం వల్ల అక్కడి జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఈ వీడియోలు కూడా మేము చూశామని తెలిపింది.
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది. స్టేటస్ కో ను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది.
Also Read: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !
ఇదిలాఉండగా.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్ మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా దీనిపై న్యాయవివాదం కొనసాగడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల చెట్లు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది.
Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!
''ఈ భూమి ఓపెన్‌గా ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చివెళ్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతాయి, కానీ వీటికి ఇక్కడ ఆవాసం లేదు. ఈ ప్రాంతంలో అభివ-ృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం. అక్కడ మొక్కల్ని పెంచుతామని'' రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Wamiqa Gabbi: క్యూట్ ఫొటోలతో వావ్ అనిపిస్తున్న వామిక!
Vinci Soni Aloysius: డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో బలవంతం.. మలయాళ నటి సంచలన ఆరోపణలు!
🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
వైజాగ్ గర్భిణీ హ*త్య కేసులో షాకింగ్ నిజాలు | Vizag pregnant Women Case | RTV
Viral Video: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!