రేవంత్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్! కులగణనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కు ఆమె మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కవిత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. By Nikhil 17 Nov 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన సర్వేలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ నెల 15న బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లారు. కవిత, ఆమె భర్త కుటుంబ వివరాలు ఇచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ కూడా కవితను చూసి అనుసరించాలని సూచిస్తున్నారు. కులగణనలో కవిత పాల్గొన్న ఫొటోలను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. Also Read : నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు వైరల్.. ఇంత సింపుల్‌గా ఉందేంటి..! HCM @revanth_anumula gari నాయకత్వంలో, తెలంగాణ ప్రభుత్వం ( @TelanganaCMO ) చేపట్టిన కులగణనకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి @KCRBRSPresident గారి కుమార్తె, మాజీ ఎంపి, ప్రస్తుత MLC @RaoKavitha (BRS Working president @KTRBRS gari సోదరి) గారు.... @BRSHarish గారు & @BRSparty చూసి… pic.twitter.com/x9ffjJVKvq — Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) November 15, 2024 Also Read : మాట తప్పి చేతులెత్తేసిన రేవంత్.. మహారాష్ట్ర ప్రచారంలో పవర్ స్టార్ పంచులు! రిజర్వేషన్ల పెంపుకు కవిత పోరాటం.. బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కులగణనకు సహకరించారని పోస్టులు పెడుతున్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత మొదటి నుండి పోరాటం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం పలు సమావేశాలు, సభలు,రౌండ్ టేబుల్ మీటింగ్స్ ను కవిత ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కుల గణన విషయంలో తమ వద్దకు ఎన్యూమరేటర్లకు కవిత అన్ని వివరాలు అందచేసిందని చెబుతున్నారు. Also Read : రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి? కులగణనకు సహకరించిన ఎమ్మెల్సీ కవితక్క దంపతులు బంజారా హిల్స్ నివాసంలో అధికారులు అడిగిన వివరాలు ఇచ్చిన దంపతులుజనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని మొదటి నుండి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత గారు గతంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం పలు సమావేశాలు, సభలు,రౌండ్… pic.twitter.com/hgVp6W9Pot — Susheela Reddy BRS (@susheela353) November 16, 2024 ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కవిత కోరినట్లు ఆమె అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. Also Read : నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! #revanth-reddy #caste-census #mlc kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి