/rtv/media/media_files/2025/02/27/mS7ePzaZfhhwgNuiRgoe.jpg)
location tracking Photograph: (location tracking )
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కొత్త రూల్ తీసుకురాబోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్‌లను తప్పని సరి చేయాలని నిర్ణయించుకుంది. ఇకపై తయారు చేసే వాహనాలతోపాటు ప్రస్తుతం నడుస్తున్న రవాణా వాహనాలకు GPS సిస్టమ్ లొకేషన్ ట్రేసింగ్ పరికరాలు తప్పనిసరి చేయనుంది. ఈమేరకు అనుమతి కోరుతూ కేంద్రాన్ని లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం.
పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో అక్రమ రవాణా, మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు చేటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా నింబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తే ఇండియాలో ఈ తరహా నిబంధనలు తెచ్చిన తొలి రాష్ట్ర తెలంగాణే అవుతంది. ఈ రూల్ పాటించకుంటే ట్రాఫిక్ వైలేష్ కేసులు పెట్టి, వాహనాలకు సీజ్ కూడా చేయనున్నారట.
Also read : Shivaratri: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి అఘోరా క్షుద్ర పూజలు!
ఖైరతాబాద్ లోని రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాల కదలికలపై నిఘా ఉంచనున్నారు.
రాష్ట్రంలో ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ వాహనాలకు వీఎల్టీడీలను తప్పనిసరి చేసిన తర్వాత రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రవాణా, గూడ్స్ అవసరాల కోసం వినియోగించే పాత, కొత్త వాహనాలన్నింటికీ వీఎల్టీడీల అమలును పకడ్బందీగా చేపట్టనున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వెహికల్, గూడ్స్ వాహనాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగుతున్న ఇలాంటి అన్ని రకాల వాహనాల్లో కూడా వీఎల్టీడీలను అమర్చనున్నారు.
Also read : SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం