/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Govt-Jobs-jpg.webp)
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవన్యూ శాఖలో భాగంగా10 వేల 954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి వీఆర్వో/ వీఆర్ఏగా కనీసం ఐదేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.
ఇప్పటివరకు 58 వేల 868 పోస్టులు
వీరికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులు ఉంటాయి. గతంలో వీఆర్వోలుగా పని చేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న 6 వేల మందిని జీపీవోలుగా నియమించే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అదనంగా మరో 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాగా 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు 58 వేల 868 పోస్టులను భర్తీ చేసింది.
Also read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
Also read : చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!