/rtv/media/media_files/2025/04/03/u85cp0uJVNFYmMlM6oqq.jpg)
ts-musi
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరిసరాల్లో ప్రణాళికా రహిత నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టింది. మూసీ పరిసరాల్లోప్రణాళికా రహిత నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు నలుగురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జేఎండీ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్త నిర్మాణాలకు చేపట్టకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు
మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు, కమిటీ క్లియర్ చేసేంత వరకు ఏవిధమైన కొత్త నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా అంటే ప్రజల సదుపాయం కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలన్నా కూడా కమిటీ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. బఫర్ జోన్‌లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది.
Also read : UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
కాగా దాదాపుగా రూ.4 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపూఘాట్ అభివృద్ధి పనులను త్వరలో ప్రభుత్వం చేపట్టనుంది. మూసీ నది మీద 17 కొత్త వంతెనల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా నదీ తీరం వెంట మెట్రో రైల్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్.
Also Read : Hyderabad : పాపం...అన్న బిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వెళ్తుండగా.. యాక్సిడెంట్లో