/rtv/media/media_files/2025/02/22/tuT0ylbewoFt2yJyotNy.jpg)
Telangana Government Jobs
TG Govt Jobs: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు సంతకం చేశారు. దీంతో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టులు.. అంటే మొత్తంగా 14,236 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన నోఫికేషన్లు జారీ కానున్నాయి.
ఇది కూడా చదవండి: Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు
అయితే.. నోటిఫికేషన్లను జిల్లాల వారీగా కలెక్టర్లు జారీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేస్తే అంగన్వాడీ కేంద్రాలు మరింత పటిష్టంగా మహిళలు, చిన్నారులకు సేవలు అందిస్తాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CM Revanth: బీసీ కులగణనపై బీజేపీ కుట్ర ఇదే.. రేవంత్ సంచలన ప్రెస్ మీట్!
రాష్ట్రంలో మొత్తం 35 వేల అంగన్వాడీ కేంద్రాలు..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 140 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా.. మిగతా 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ తో పాటు ఒక హెల్పర్ ఉంటారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో మాత్రం ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసింది. దీంతో అక్కడ హెల్పర్ పోస్టులను మంజూరు చేశారు.