అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

TG: తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
TELANGANA TALLI

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సచివాలయంలో జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి ఫొటోను విడుదల చేసింది.

Also Read: గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు

కఠిన చర్యలు తప్పవు...

అయితే, తెలంగాణ తల్లి విగ్రహంపై బహిరంగ ప్రదేశాల్లో, ఆన్‌లైన్లో, సామాజిక మాధ్యమాల్లో, మాటలు, చేతలతో అగౌరవపర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపర్చడం నేరంగా పరిగణించబడుతుందని సీఎస్ శాంతికుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం ఆలోచించిందని..  వీటన్నిటి ప్రతిబంబించేలాప్రత్యేక చిహ్నాలు కలిగిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొంది. తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక అని ఆమె అన్నారు. కాబట్టి తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడం నిషేంధించడం జరిగిందని చెప్పారు. ఎవరైనా ఈ విగ్రహాన్ని అవమానించడం, తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Also Read: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు