New Year 2025: మందు బాబులకు న్యూఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా ఇంటికి వెళ్లొచ్చు.. 500 కార్లు రెడీ!

తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 న్యూఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచితరవాణా సదుపాయం అందించనుంది. దీనికోసం 500కార్లు, 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉండనున్నారు.

New Update
NEW YEAR CELEBRATIONS

NEW YEAR CELEBRATIONS

డిసెంబర్ 31 వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువత తహతహలాడుతోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో జాలీగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ ఏడాదిలో జరిగిన మంచి, చెడు, కష్టం, సుఖం, హ్యాపీ, సాడ్ వంటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని చుక్క ముక్కతో చిందులేయనున్నారు. 

ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

స్నేహితులంతా కలిసి పార్టీలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పబ్బులు, డాన్స్‌లతో హోరెత్తించేందుకు రెడీ అయ్యారు. గుమగుమలాడే వంటలతో.. చల్లని చలిలో శరీరాన్ని హీటెక్కించే మద్యంతో చిందులేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చిందేస్తూ మందేయిరా.. మందేస్తూ చిందేయిరా అంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేయనున్నారు.

ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

కీలక నిర్ణయం

అయితే ప్రతి ఏటా డిసెంబర్ 31 రాత్రి ఎన్నో విషాధ ఘటనలు చోటుచేసుకుంటాయి. మద్యం మత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఆ రోజు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. ఎన్నో గ్రామాల్లో విషాధ ఛాయలు అలముకుంటాయి. ఇక అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

ఉచిత రవాణా సదుపాయం

డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనుంది. ఈ మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఫోర్ వీలర్ అసోసియేషన్ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

500 కార్లు, 250 బైక్‌లు

దీని కోసం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటారని.. సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఉచిత రవాణా సదుపాయం కోసం ఫోన్ నెంబర్‌ను సైతం అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 31న సేఫ్ జర్నీ కోసం ఈ కాంటాక్ట్‌ను 9177624678 సంప్రదించాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు