Holidays : బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. వరుసగా నాలుగు రోజులు సెలవులు! తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి. By Manoj Varma 14 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Holidays : హైదరాబాద్ మహానగరం రోడ్లనీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణాలో పండుగలు, సాధారణ సెలవులు కలిపి కాలేజెస్, స్కూల్స్, ఆఫీసులకు మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14న సెకండ్ సాటర్డే, 15న ఆదివారం, 16న మీలాద్ ఉన్ నబీ ముస్లిం పండగా, 17న గణేష్ నిమజ్జనోత్సవాలు వచ్చాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు హాయిగా ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కొంతమంది సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొంత మంది ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి సిటీ శివారు ఫాంహౌజ్ లకు క్యూ కట్టారు. ఇంకొంతమంది తమ హాలీడేస్ ను గణేష్ పూజలో సమయాన్ని గడుపుతున్నారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి మరో వైపు హైదరాబాద్ లో ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సప్తముఖ రూపంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ లలో జనాలు కిటకిటలాడుతున్నారు. సెప్టెంబర్ 17న మహా గణనాథుడు నిమ్మజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. #telangana #holidays మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి