Arekapudi Gandhi : గాంధీపై హత్యాయత్నం కేసు.. మరో ఇద్దరు కార్పోరేటర్లపై

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి.

author-image
By Manoj Varma
New Update

Arekapudi Gandhi :

ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం నాడు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. కౌశిక రెడ్డి నివాసంలోకి వెళ్లడానికి గాంధీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, టమాటాలతో ఆయన అనుచరులు దాడి చేశారు. దీంతో ఈ విషయమై కౌశిక్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గాంధీతో పాటు ఆయన సోదరుడు, కుమారుడుపై సైతం కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లపైనా క్రిమినల్‌ కేసులను నమోదు చేశారు పోలీసులు. కార్పొరేటర్లు వెంకటేష్‌గౌడ్, శ్రీకాంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే గాంధీపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు మొన్నటి నుంచి డిమాండ్ చేశారు.గాంధీకి సహకరించిన ఏసీపీ, సీఐ, ఎస్ఐపై సైతం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరు ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో అరెస్ట్ చేసి కందుర్గ్ పీఎస్ కు తరలించారు. అక్కడ అర్థరాత్రి వరకు ఉంచి వదిలేశారు. నిన్న సైతం బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. గాంధీ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన కౌశిక్ రెడ్డిని సైతం అడ్డుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు