/rtv/media/media_files/2025/02/07/6JvKNTU4Q3Xt0yJWtENb.jpg)
Komatireddy Rajagopal Reddy Revanth Reddy
TG Politics: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ లో ఆగిపోయిన వర్గపోరు మళ్లీ మొదలైంది. నిత్యం ఎక్కడో చోట అసమ్మతి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న నిర్వహించిన సీఎల్పీ భేటీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు, అప్లికేషన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. జాబితాలు విడుదల చేయడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం దగ్గర పైసలు లేకుంటే కొత్త స్కీమ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాలని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా చాలా గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవని.. చిన్నచిన్న కాంట్రాక్టులకు బిల్లులివ్వలేకపోతున్నామని రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని పథకాలు అమలు చేసినా విమర్శలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు!
గతంలోనూ ప్రభుత్వంపై కామెంట్స్..
గతంలోనూ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని.. కేసీఆర్ సర్కారే బాగుందని మెచ్చుకుంటున్నారని ఓ సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు కోమటిరెడ్డి. ప్రస్తుతం సీఎల్పీ భేటీలోనే ఏకపక్ష నిర్ణయాలంటూ ఫైర్ అయ్యి మరో సంచలనం సృష్టించారు. దీంతో కోమటిరెడ్డి నెమ్మదిగా అసంతృప్తిని బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రి పదవిని ఆశించారు.
ఇది కూడా చదవండి: CLP Meeting: ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. గీత దాటితే ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ర నేతల వార్నింగ్!
తాను హోం మంత్రిని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించి తన కోరికను బయట పెట్టారు కూడా. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే తనకు కేబినెట్ లో చోటు ఖాయమని కూడా ప్రకటించారు. అయితే.. ఎంపీగా చామల గెలిచినా రాజగోపాల్ రెడ్డి కోరిక మాత్రం నెరవేరలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీపై తన అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్తు తెలుస్తోంది.
Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని.. బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు.
bandi-sanjay counter
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని.. బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పగటి కలలు మానుకోవాలని.. సీఎం సొంత జిల్లా, సిట్టింగ్ సీట్‌లో గెలిచామన్నారు సంజయ్. కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి అంటూ సంజయ్ కామెంట్స్ చేశారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్
Mahesh Babu: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్
Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్
Today Gold Rate : ఒక్కరోజే రూ. 2700 పెరిగింది.. తులం బంగారం ఇప్పుడెంతంటే!