BIG BREAKING: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సర్కార్ పై కేంద్రానికి సీఎం రేవంత్ కంప్లైంట్!

కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.

author-image
By Nikhil
New Update
TS CM Revanth Reddy AP CM Chandrababu

కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు. నేడు ఢిల్లీలో సీఆర్ పాటిల్ తో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. ఈ సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరి నది జలాల విషయంలో తెలంగాణ ప్రాజెక్టుల లెక్క తేలిన తర్వాతనే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు. మొదట తెలంగాణ గోదావరి నది జలాలను వినియోగించుకున్న తర్వాతనే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: Addanki Dayakar: నాకు MLC రాకుండా అడ్డుకోవద్దు ప్లీజ్.. జానారెడ్డి, కోమటిరెడ్డితో అద్దంకి కీలక భేటీ!

తెలంగాణకు తీవ్ర అన్యాయం..

కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీరు ఉపయోగించుకుంటుందన్నారు. ఈ విషయమై తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధానం పై అభ్యంతరాలు వ్యక్తం చేశామన్నారు. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రమంత్రి చెప్పారన్నారు. తమ అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి తమకు చెప్పారన్నారు. కృష్ణా నది జలాల వివాద ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరినట్లు ఉత్తమ్ వివరించారు.
ఇది కూడా చదవండి: MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?

శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పామన్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామన్నారు. NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామన్నారు.

తెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, తాను కేంద్రం వద్ద రాష్ట్ర వాదనలు బలంగా వినిపించినట్లు వివరించారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం తమకు హామీ ఇచ్చిందని వివరించారు. దీర్ఘకాలికంగా సాగుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని కోరామన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడిన మాటలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. అధికారం పోయిన అక్కసులో కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ కూతురు పెద్ద కార్లలో తిరుగుతుంటే మా బిడ్డల్లో బస్సుల్లో కూడా తిరక్కూడదాని ప్రశ్నించారు. 

New Update
MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!!

కెసిఆర్ ఎవరు కోసం బాధపడుతున్నారు.. కేవలం అధికారం పోయింది అన్న బాధ తప్ప...ఆయన కుటుంబంలో చీలికలు బజారున పడుతున్నాయన్న బాధ కేసీఆర్ ఇసుమంతైనా లేదని మంత్రి సీతక్క విమర్శించారు. మీ కూతురు పెద్దపెద్ద కార్లలో తిరుగుతారు.. కానీ ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే కూడా ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ మనుషులను పంపించి గొడవలు చేస్తున్నారంటే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దరిద్రమని అత్యంత నీచంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఉచిత ప్రయాణం వల్ల ప్రతి మహిళకు మూడు నాలుగు వేలు ఆదా అవుతుంది .

నియంత వచ్చి కన్నీరు కారుస్తున్నారు..

అధికారులు బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు చేయించి 100% మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్టు సంతకాలు చేసుకున్నావు. మేము గ్రామాల్లో బోర్లను రిపేర్ చేయించాము.. కొత్త సోర్సులను కూడా మిషన్ భగీరథ కోసం సృష్టిస్తున్నాం. ప్రతి ఏటా వందల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథను మెరుగుపరుస్తున్నాము. మీలాంటి వారు రైతుల ఆత్మహత్యలు గురించి మీరు మాట్లాడితే విడ్డూరంగా ఉంది అంటూ సీతక్క కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  మీ హయాంలో ఐదువేల రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చాయి. నువ్వు మీ ఫామ్ హౌస్ లో ఒక ఎకరంలో కోటి రూపాయల పంట పండించావు... ఆ కిటుకు ప్రజలకు ఎందుకు వివరించలేదు అంటూ సీతక్క దుయ్యబట్టారు.  ఆడబిడ్డలకు బస్ ఇస్తే నచ్చదు.. 500 వేల గ్యాస్ ఇస్తే నచ్చదు. పేద కుటుంబాలకు ఇల్లు ఇస్తే నచ్చడం లేదు.  నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పిస్తే నష్టం లేదు . 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కానీ  విద్యుత్ సంస్థలకు 60 వేల కోట్ల బకాయిలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని సీతక్క విమర్శించారు.  

ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు. మీరు అలా ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మేమే నియంతలమైతే ఈరోజు మీ భ జరిగి ఉండేదా. ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉంటుందని సభ సజావుగా సాగాలని ప్రభుత్వం సహకరించింది...కేసీఆర్ అది గమనించాలని సీతక్క మాట్లాడారు. మేము సభకు అనుమతిస్తే ముసలి కన్నీరు కారుస్తున్నావు.  నీకు అధికారం పోయేసరికి ఆ బాధలో ఉండి మాట్లాడుతున్నావ్.  అధికారం పోగానే అసెంబ్లీకి రానీ నువ్వు ఒక నాయకుడివా..అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరఫున మాట్లాడే వారే నిజమైన నాయకులు అని సీతక్క అన్నారు. అధికారం పోయింది అన్న బాధ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక వాస్తవాన్ని ఆయన మాట్లాడలేదు. 
అధికారం పోయిన తర్వాత ఒక నియంత దొంగ ఏడుపు ఏడిస్తే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసిఆర్. ఆయన ప్రసంగంలో పస లేదని సీతక్క విమర్శించారు. 

 today-latest-news-in-telugu | kcr | brs | minister | minister-sitakka 

Also Read: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!

Advertisment
Advertisment
Advertisment