Two rowdy sheeters : ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.
Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి. మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ వేటు వేసినట్లు వివరించారు.
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
Also Read: America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.
Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!