ప్రజల పక్షన నిలబడి పోరాటం చేసినందుకే తనపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గతంలో అరెస్ట్ చేసిన సమయంలో జడ్జికి కూడా ఇదే చెప్పానన్నారు. నిన్న RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. డిస్ క్వాలిఫై చేయడానికి తనది నామినేటెడ్ పోస్ట్ కాదన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడిని తానన్నారు. జగిత్యాల ఘటనలో ముందు ఎమ్మెల్యే సంజయ్ ముందు తనను నెట్టాడన్నారు. నువ్వు ఏ పార్టీలో గెలిచావ్? అని మాత్రమే సంజయ్ ను ప్రశ్నించానన్నారు. తమ పార్టీ బీఫామ్ మీద గెలిచి మోసం చేసి పోతే ప్రశ్నించకుండా ఎలా ఊరుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!
హుజూరాబాద్ కు నిధులు ఇవ్వట్లే..
తమ నాయకుల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నానన్న కారణంతో హుజూరాబాద్ ను నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవన్నారు. తనను మోసం చేయడంతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి పాడు చేస్తున్నాడన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ కు బిగ్ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి BRSలోకి!
నా లక్ష్యం అదే..
బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పోరాటం చేస్తానన్నారు. ఓటుకు నోటు కేసులో చిప్ప కూడు తిన్న రేవంత్ రెడ్డి అందరికీ అలానే చేయాలన్న ఎజెండాతో పని చేస్తున్నాడని విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశమే లేదన్నారు. ఆయన ఎలాంటి అవినీతి చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని నడుపుతోంది కేసీఆరేనన్నారు. పాడి కౌశిక్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.