కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై RTVతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలన్నారు. మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయాలంటే గాంధీ భవన్ లో చేయాలన్నారు. సీఎంకు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జికి మధ్య గ్యాప్ ఏంటో వారు తేల్చుకోవాలన్నారు. వారి మధ్య గొడవేంటో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిపెట్టాలన్నారు. ఇన్ఛార్జి ఏం చేస్తుంది? సీఎం ఏం చేస్తున్నారు? ఎవరేం చేస్తున్నారు? అనేది పార్టీ చూడాలన్నారు. సీఎంను మారుస్తారా? హుస్సేన్ సాగర్ లో దూకుతారా? అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమన్నారు. మీనాక్షి నటరాజన్ తీరు సరికాదన్నారు. ఆమె పరిధి ఏంటనేది తెలుసుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలపై ఆరా తీయాలనుకుంటే ఇంటెలిజెన్స్ వివరాలు తీసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
కానీ.. ఇలా సెక్రటేరియట్ లో రివ్యూ చేయడం మాత్రం సరికాదన్నారు. HCUపై స్పందిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిజాల ఆధారంగా పనిచేస్తారన్నారు. సెంట్రల్ వర్సిటీ వివాదంపై పార్టీల విషయం పక్కన పెడితే కోర్టు తీర్పు ఏంటనేది ముఖ్యమన్నారు. అది పక్కన పెట్టి ఏఐ వాడుతున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. HCUకు వెళ్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని.. అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, స్థానిక ఎంపీ కలిసి హెచ్సీయూకు వెళ్తామన్నారు. మమ్ముల్ని కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. వారి మధ్య ఇష్యూలో తమను లాగొద్దన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వస్తున్న ఆరోపణలపై సైతం రఘునందన్ స్పందించారు. వక్ఫ్ బోర్డు అంశంపై కోర్టుకెళ్తామంటున్నారన్నారు. గతంలో నోట్ల రద్దు విషయంలో, ఆర్టికల్ 370 విషయంలోనూ ఇదే చేశారన్నారు. ఎవరి భూములను కేంద్ర ప్రభుత్వం లాక్కోదని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా భూములు లాక్కుంటే స్థానిక కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కౌన్సిలర్లు ఆత్మప్రభోదానుసారం ఓటేయాలని కోరారు. అందరూ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు. భాగ్యనగరం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందనేది వారే డిసైడ్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వందకు వంద శాతం ప్రయత్నిస్తామన్నారు. అన్ని ఎన్నికల్లో తాము గెలుస్తామని చెప్పుకుంటామన్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. రఘునందన్ పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.
(cm-revanth-reddy | raghunandan rao | telugu-news | latest-telugu-news | telugu breaking news )