/rtv/media/media_files/2025/04/01/dJGalwVRcrnbASrbb0N4.jpg)
aghori attacks
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ సంచలనం సృష్టించింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి జరిగిన సమయంలో దర్శనమిచ్చింది. బట్టల్లేకుండా బయటకు రావడంతో అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలే ఓ యువతిని తనవెంట తీసుకెళ్ళి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన బీటెక్ స్టూడెంట్ వర్షిణీని తన శిష్యురాలిగా మీడియాకు పరిచయం చేసింది. అప్పటి నుంచి మరింతగా వార్తల్లోకి ఎక్కింది. ఆ యువతితో ఇప్పుడు పలు ఆలయాలను దర్శనమిస్తుంది. తన కూతురిని మాయ చేసి.. మంత్రించి అఘోరీ తనతో తీసుకెళిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాకుండా వర్షిణి అన్న హర్ష సైతం అఘోరీపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
అఘోరీ తన చెల్లి వర్షిణిపై మంత్రాలు చేసి వశపరచుకుందని అతడు తెలిపాడు. తమ ఇంట్లో అఘోరీ రెండు వారాలు ఉందని.. ఆ సమయంలో రోజూ ఆల్కాహాల్ తాగేదని.. సిగరెట్లు కాల్చేదని.. ఆఖరికి కండోమ్ ప్యాకెట్లు సైతం తీసుకురమ్మనేది అని అతడు ఆరోపించాడు. ఇలా ఇప్పుడు అఘోరీపై వర్షిణీ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు చేసింది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
అఘోరీపై దాడి
ఇదిలా ఉంటే అఘోరీపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె గత కొద్ది రోజుల నుంచి పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సూర్యపేటలో ఆమెపై ఓ యువకుడు దాడికి ప్రయత్రించాడు. అఘోరీ మెడ పట్టుకుని గుంజేశాడు. చుట్టూ ఉన్నవారు ఎంత ఆపినా.. ఆ యువకుడు ఆగలేదు. అదే సమయంలో అఘోరీ సైతం ఆ యువకుడి షర్ట్ కాలర్ పట్టుకుంది. ఇద్దరూ ఫేస్ టు ఫేస్ దాడి చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇక అక్కడితో ఆగని ఆ యువకుడు తల్వార్ తో అఘోరీపైకి వెళ్లాడు. అఘోరీ కూడా తన కారులో ఉన్న ఒక కర్రతో అతడిపై దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వారిద్దరినీ ఆపి.. అఘోరీని అక్కడ నుంచి పంపించేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. ఇది పాత వీడియో.. కానీ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(aghori videos | Lady Aghori Attack | latest-telugu-news | telugu-news | viral-video )