/rtv/media/media_files/2025/04/03/Yai68cDzpbjT5b1ho79b.jpg)
cm-revanth-supreme-court
హెచ్సీయూ కంచ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే ఇవ్వడం లేదు.
సుప్రీంకోర్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై విచారణ.
— Telangana Awaaz (@telanganaawaaz) April 3, 2025
జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ..
తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.
కంచ గచ్చి భూముల్లో ఒక్క… pic.twitter.com/zeBw0r06g9
హెచ్సీయూలో ఉద్రిక్తత
మరోవైపు హెచ్సీయూలో ఉద్రిక్తత కొనసాగుతుంది. 400 ఎకరాలపై ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. 400 ఎకరాలను కాపాడాలంటూ విద్యార్ధులు నిరసన గళమెత్తుతున్నారు. విద్యార్ధుల ఆందోళనలకు మద్దతు పెరుగుతుంది. టాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ బాగానే వస్తోంది. 400 ఎకరాల్లో ఉన్న ప్రకృతిని, నెమళ్లు, జింకలను రక్షించాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్‌కు రేణుదేశాయ్, యాంకర్ రష్మీ విజ్ఞప్తి చేశారు. అయితే ఇవేం పట్టించుకోకుండా 400 ఎకరాలు ప్రభుత్వానిదేనంటూ JCBలతో గవర్నమెంట్ చెట్లు నరికేస్తూ క్లీన్ చేస్తుంది.
ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ నేతల యత్నించారు. దీంతో ఏబీవీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూములు వేలం వేయొద్దంటూ ఏబీవీపీ నేతల నినాదాలు చేశారు.
Also Read : ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!
Also Read : ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్