/rtv/media/media_files/2025/03/20/GTEYz4DK44JjgoAYNIQo.jpg)
Telangana SSC Exams
SSC exams : తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2650 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.వీరిలో బాలురు 2,58,895 మందికాగా.. బాలికలు 2,50,508 మంది ఉన్నారు.పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
అయితే పదవతరగతి విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే ఈ నిబంధనను ప్రభుత్వం కొంతమేర సడలించింది. విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షరాసే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. దీని ద్వారా పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఆలస్యంగా వెళ్లి టెన్షన్‌తో పరీక్ష రాసే కన్నా, అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చని అధికారులు చెబుతున్నారు.
Also Read: IPL 2025: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
ఈ పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లో పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేసింది. ఇకపై విద్యాశాఖ 100 మార్కులకు ఫైనల్ పరీక్షలను నిర్వహించనుంది. 2024--25 విద్యా1 సంవత్సరం నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!