Defection MLAs : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వారి సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ న్యాయపోరాటానికి దిగింది. ఈ క్రమంలో సుప్రీం సైతం వారికి నోటీసులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలంటూ స్పీకర్‌ను మందలించింది.

New Update
Disqualification Of MLAs  https://www.thehansindia.com/telangana/disqualification-of-mlas-apex-court-directive-to-assembly-sparks-bypoll-buzz-in-telangana-942106

Disqualification Of MLAs https://www.thehansindia.com/telangana/disqualification-of-mlas-apex-court-directive-to-assembly-sparks-bypoll-buzz-in-telangana-942106

Defection MLAs : తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వారి సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ న్యాయపోరాటానికి దిగింది. ఈ క్రమంలో సుప్రీం సైతం వారికి నోటీసులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలంటూ స్పీకర్‌ను మందలించింది. ఈ క్రమంలో  కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించడానికి దారి తీసిన కారణాలకు లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

Also Read: Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!

కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ గత కొంతకాలంగా పోరాడుతుంది. సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. అంతేకాదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు కనీస సమాధానం కూడా ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Also Read:  Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!


మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్‌ 38 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే బీఆర్‌ఎస్‌ ఓటమితో పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో నాలుగు నెలల్లో వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించించిది. అయినా ఈ వ్యవహారం ముందుకు కదలలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ వేసింది. మొదట తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. ఆ తర్వాత మరో ఏడుగురు కూడా పార్టీ మారడంతో వారిపై కూడా వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్. ఈ క్రమంలోనే స్పీకర్‌ను ఉద్దేశించి సీరియస్‌ అయింది కోర్టు. చర్యలు తీసుకోవడానికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది. 

Also Raed: Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!

మొదటి ముగ్గురితోపాటు మరో ఏడుగురి అనర్హతపై ఒకేసారి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు తెలపడంతో పాటు కేసును ఈ నెల 10 కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కూడా కోరింది బీఆర్‌ఎస్. దీనిపై స్పందించిన స్పీకర్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా సమాధానాలు చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. స్పీకర్‌ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also Raed: Jani Master : జానీ మాస్టర్కు గ్రాండ్ వెల్కమ్.. కొరియోగ్రాఫర్ ఎమోషనల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు