TG News: ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు

తల్లిని భారంగా భావించిన కొడుకులు ఏకంగా శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సంక్షేమశాఖ అధికారులు రాజవ్వను ఆస్పత్రికి తరలించారు.

New Update
rajava

Jagityala District

TG News: సమాజంలో రోజు రోజుకు మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. తోటివారికి సాయపడటం సంగతి పక్కన ఉంచితే సొంత వారినే పట్టించుకోవడం లేదు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన పిల్లలే వారిని భారంగా చూస్తున్నారు. కన్నవారనే కనికరం కూడా చూపడం లేదు. జగిత్యాల జిల్లా మోతే గ్రామంలో రాజవ్వకు నలుగురు కుమారులు ఉన్నారు. అందరినీ పెంచి పెళ్లి కూడా చేసింది. వృద్ధాప్యంలో వాళ్లు మాత్రం తల్లిని పట్టించుకోలేదు. 

శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ..

నలుగురు కుమారులకు రాజవ్వగా భారంగా మారింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నారు. అయితే ఏ వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలోనో చేర్పించకుండా చెప్పుకోలేని పని చేశారు. ఏకంగా రాజవ్వను శ్మశానంలో వదిలేశారు. 8 రోజుల నుంచి రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. కొడుకులు పట్టించుకోకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో అర్థంకాక శ్మశానంలోనే కాలం వెల్లదీస్తోంది.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

కాలు విరిగినా కనికరం లేదు:

మనసు మార్చుకుని కొడుకులు వచ్చి తీసుకెళ్లకపోతారా అంటూ ఎదురుచూస్తోంది. గతంలో ఓ కుమారుడు పెన్షన్‌ డబ్బుల కోసం దారుణంగా కొట్టేవాడని, ఓ సందర్భంలో కాలు విరిగిపోవడంతో రాజవ్వ మంచం పట్టింది. అంతమంది కొడుకులు ఉన్నా పట్టించుకోవడం లేదంటూ రాజవ్వ రోదిస్తోంది. కొడుకులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా శ్మశానవాటికకు వచ్చిన సంక్షేమశాఖ అధికారులు రాజవ్వను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రాజవ్వ పూర్తిగా కోలుకున్న తర్వాత వివరాలు తీసుకుని కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరో భారీ ఫైర్ యాక్సిడెంట్!

Also Read: పండ్ల రసాల్లో రసాయనాలు ఎలా గుర్తించాలి?

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

Advertisment
Advertisment
తాజా కథనాలు