/rtv/media/media_files/2026/05/20/kurchi-thatha-no-more-2026-05-20-20-10-06.jpg)
Kurchi Thatha No More
BREAKING : ‘కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, సోషల్ మీడియాను ఊపేసిన 'కుర్చీ తాత' ఇకలేరు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ వాసి అయిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా బుధవారం కన్నుమూశారు. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ప్రస్తుత వేసవి తీవ్రతకు, తీవ్రమైన వడదెబ్బ (Sunstroke) కారణంగానే ఆయన మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణం పట్ల సోషల్ మీడియా ఫాలోవర్లు, నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ ఇంటర్వ్యూ టు టాలీవుడ్ స్క్రీన్
ఒక సాధారణ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సరదాగా ఆయన చెప్పిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ రూపంలో వైరల్‌గా మారింది. దాంతో ఆయన రాత్రికి రాత్రే ‘కుర్చీ తాత’గా మారిపోయారు. ఆ క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఈ డైలాగ్‌ను ఏకంగా ఒక మాస్ సాంగ్ కోరస్‌గా వాడారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ డైలాగ్‌ను రీమిక్స్ చేసి సాంగ్‌లో పెట్టడంతో కుర్చీ తాత పాపులారిటీ మరింత స్కై రాకెట్ అయింది. ఈ డైలాగ్‌ను వాడుకున్నందుకు గాను థమన్ ప్రత్యేకంగా ఆయనకు పారితోషికం (Remuneration) కూడా అందించడం అప్పట్లో విశేషంగా నిలిచింది.
గతంలో పుకార్లు.. ఇప్పుడు నిజమైన విషాదం
గతంలో కూడా 'కుర్చీ తాత చనిపోయాడు' అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్వయంగా కుర్చీ తాతే మీడియా ముందుకు వచ్చి.. "నేను బ్రతికే ఉన్నాను, తప్పుడు వార్తలు నమ్మకండి" అంటూ ఆ పుకార్లను తీవ్రంగా ఖండించారు. కానీ, ఈసారి నిజంగానే ఆయన వడదెబ్బకు గురై హఠాన్మరణం చెందడం అటు కుటుంబ సభ్యులను, ఇటు ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక సామాన్యుడిగా ఉంటూ తనదైన మాస్ డైలాగ్‌తో ఇండస్ట్రీని సైతం ఆకర్షించిన కుర్చీ తాత మరణం బాధాకరం.
Follow Us