Telangana : ఒకే జిల్లాకు కలెక్టర్ గా భార్య,ఎస్పీగా భర్త!

బదిలీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా ఆమె భర్త శబరీష్ ఎస్సీగా పనిచేస్తుండటం విశేషం. ఇలా భార్యభర్తలు ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తుండటం విశేషం. 

New Update
collector

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బదిలీల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్(Mahabubabad District Collector) గా స్నేహా శబరీశ్(Sneha Shabarish) నియమితులు కాగా ఆమె భర్త శబరీష్ ఎస్సీగా పనిచేస్తుండటం విశేషం. ఇలా భార్యభర్తలు ఇద్దరు ఒకే జిల్లాలో పనిచేస్తుండటం విశేషం. 

Also Read :  హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్‌ సమస్యకు చెక్

గతంలో హనుమకొండ కలెక్టర్ గా

కాగా స్నేహా శబరీశ్ గతంలో హనుమకొండ కలెక్టర్ గా పనిచేశారు. ఆమె స్థానంలో హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బజ్పాయ్ నియమితులయ్యారు. హనుమకొండకు రాకముందు ఆమె ఆసిఫాబాద్ కలెక్టర్‌గా పనిచేశారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన  స్నేహా శబరీశ్...  22 జూలై 1992లో పుట్టారు. గతంలో జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా సేవలందించి పాలనలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఇక పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్థిక శాఖలో కూడా మార్పులు చేస్తూ గౌరవ్ ఉప్పల్‌ను సెక్రటరీగా, సిక్తా పట్నాయక్‌ను స్పెషల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. అలాగే కీలకమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను దాన కిషోర్‌కు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను రాహుల్ బొజ్జాకు అప్పగించింది.

విద్యుత్ శాఖకు సంబంధించి SPDCL సీఎండీగా జితేశ్ వి. పాటిల్, కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ నియమితులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్ర మిశ్రా, హన్మకొండకు చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెంకు అంకిత్ కొత్త కలెక్టర్లుగా రానున్నారు. అలాగే యాదాద్రి జిల్లాకు అనురాగ్ జయంతి, జనగాంకు సందీప్ కుమార్ ఝా, జోగులాంబ గద్వాలకు రిజ్వాన్ బాషా షేక్, రాజన్న సిరిసిల్లకు గరిమా అగర్వాల్, వికారాబాద్‌కు దీపక్ తివారీ, మెదక్ జిల్లాకు ప్రతిమా సింగ్ కలెక్టర్లుగా వెళ్లనున్నారు.

ఇతర విభాగాల్లో కూడా పమేలా సత్పతిని లేబర్ స్పెషల్ కమిషనర్‌గా, బి.ఎం. సంతోష్‌ను ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, రాహుల్ రాజ్‌ను కోఆపరేటివ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కలెక్టర్లుగా ఉమా శంకర్ ప్రసాద్, ఫైజాన్ అహ్మద్‌లు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 

Also Read :  పింఛను దారులకు పాక్షిక ఊరట...పెరగనున్న చేయూత పించన్‌..కానీ..?

Advertisment
తాజా కథనాలు