/rtv/media/media_files/2025/03/09/H9P1To5KT6AzWfE5WCVo.jpg)
SLBC tunnel rescue
16 రోజులుగా కొనసాగుతున్న SLBC టన్నల్ సహాయక చర్యల్లో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. ఆ డెడ్‌బాడీ పంజాబ్‌కు చెందిన TBM ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‌దిగా గుర్తించారు. గురుప్రీత్ మృతిపట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలిపారు. అతని కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం కింద రూ.25 లక్షలు ప్రకటించింది. ఈమేరకు గురుప్రీత్ సింగ్ ఫ్యామిలీ చెక్కును అందజేయనున్నారు అధికారులు. మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించడానికి పంజాబ్‌లోని ఆయన స్వస్థలానికి తరలిస్తున్నారు అధికారులు. గురుప్రీత్ సింగ్ SLBC యొక్క టన్నెల్ బోరింగ్ పనిని చేస్తున్న అమెరికన్ కంపెనీ రాబిన్స్ కోలో ఉద్యోగి. ఆయన తండ్రిపేరు విర్సా సింగ్, భార్య రాజ్విందర్ కౌ.
Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
రెస్క్యూ టీమ్ లు మరో ఏడుగురి మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. టన్నల్ లో టీబీఎం ముందు భాగంలో గురుప్రీత్ సింగ్ డెడ్‌బాడ్ లభ్యమైంది. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో తవ్వగా ఒక మృతదేహం బయటపడింది. ఫిబ్రవరి 22న టన్నల్‌లో నీటి ప్రవాహం కారణంగా సొరంగం కూలిపోయింది. నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందివ్వడానికి చేపట్టిన ప్రాజెక్టే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ ప్రాజెక్ట్. సొరంగం ద్వారా 45 కీలో మీటర్లు కృష్ణా జలాలు తరలించనున్నారు. అందులో పని చేస్తున్న కార్మికుల్లో 8 మంది చిక్కుకుపోయారు. అప్పటి నుంచి అనేక రకాల బృందాలు వచ్చి వారిని రక్షించే ప్రయత్నాలు చేశాయి. అయినా ఫలితం దక్కలేదు.
Also Read: NZ VS IND: జియో హాట్‌స్టార్ రికార్డ్.. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 84 కోట్లకు చేరిన వ్యూస్