/rtv/media/media_files/2025/02/27/IAiOWfunAGD11Fh5Zb0j.jpeg)
SLBC Tunnel
SLBC : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్‌లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. లోపల పిల్లర్లు వేసి కన్వేయర్ బెల్ట్‌ను రెస్క్యూ బృందం కొనసాగిస్తున్నారు. ఇక చివరి దశలో టీబీఎం మిషన్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు డీ వాటరింగ్ కొనసాగుతోంది. నీరు ఎక్కువగా ఊరుతుండటంతో మట్టి తవ్వకాలకు ఆటంకం కలుగుతుంది. 7 అడుగుల లోతు తవ్వినా మృతదేహాల ఆనవాళ్లు మాత్రం ఇంకా దొరకలేదు. -- శిథిలాల కింద మృతదేహాలను వెలికితేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. టన్నెల్‌లో పరిస్థితులు రెస్క్యూ కు ఆటంకంగా మారాయి.
Also Read : విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ
టన్నెల్‌లో భారీగా ఊటనీరు ఉబికిరావడంతో పాటు బురద ఎక్కువగా ఉండటం, మట్టిపెల్లలు కూలుతుండంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. టన్నెల్‌లో తవ్వుతున్న చోట నీరు ఉబికివస్తోంది. దీంతో భారీ మోటర్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం మిషన్ కట్ చేస్తున్నారు. కట్ చేసిన భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. టెన్నెల్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ టీమ్‌లు రెస్క్యూను నిర్వహిస్తున్నాయి. సిబ్బంది కన్వెయర్ బెల్ట్‌ను సరిచేసే పనిలో ఉన్నారు.
Also Read: AP: విడదల రజనీపై విచారణ..అనుమతి కోసం గవర్నర్ కు లేఖ
ఇక టన్నెల్‌లో మరో ప్రమాదం పొంచి ఉందని రెస్క్యూ బృందం సభ్యులు చెబుతున్నారు. డీ వాటరింగ్ చేస్తున్నా నీటి ఊట మాత్రం ఆగడం లేదు. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట ఊరుతోంది. మరోవైపు మట్టి కూడా కూలుతోంది. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వినా ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో రెస్క్యూను కొనసాగించడమా; ముగించడమా అనే విషయంలో అధికారులు తర్జనబర్జనలు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలను తింటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు
రెండు రోజులుగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ కోసం రెస్క్యూ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రమాదంతో కన్వెయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రెండు రోజులు శ్రమించిన ఇంజినీర్లు బెల్ట్ ను రీస్టార్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో రెస్క్యూ ఆఫరేషన్ మరింత వేగంగా సాగనుంది.
Aslo Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!