SLBC UPDATE : ఎస్ఎల్‌బీసీ సొరంగంలో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం ఇటీవల రోబోలను కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్ శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సొరంగంలోని 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం జరుగగా ప్రస్తుతం 13. 5 కి.మీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చివరి 50 మీటర్ల వద్దే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు చెప్పారు. క్యాడవవర్ డాగ్స్ చూయించిన స్పాట్లలో ముమ్మర తవ్వకాలు చేపట్టారు. మినీ హిటాచీల సాయంతో తవ్వకాలు చేపట్టారు. మరో రెండు స్పాట్లలను గుర్తించిన క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి.--- క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో దుర్వాసన వస్తున్నట్లు రెస్క్చూ సిబ్బంది పేర్కొంటున్నారు. GPR రాడార్, క్యాడవర్ డాగ్స్ ఒకే ప్రాతాన్ని గుర్తించడంతో అదే ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
Also Read : 60ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ హీరో డేటింగ్.. ఎవరీ గౌరీ స్ప్రాట్?
అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద స్థలానికి తీసుకువచ్చారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం వంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు రోబోను పరిశీలించిన అనంతరం.. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలిసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద స్థలానికి వెళ్లారు. చివరి 50 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సిబ్బంది చెబుతున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరోసారి కాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దింపనున్నారు. అటు టీబీఎం శిథిలాల కట్టింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.
Also Read : జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఫిభ్రవరి 22వ తేదీన ఎస్ఎల్భీసీ టన్నెల్ పై కప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టన్నెల్ లో 40 మంది ఉండగా 32 మంది బయటపడ్డారు. సొరంగం 14వ కిమీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ ను తవ్వుతున్న బోరింగ్ మిషన్ కూలడంతో అక్కడ ఉన్న ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి వివిధ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, మృతదేహాల గాలింపు కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ టీంకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సొరంగంలో పెద్ద ఎత్తున నీరు ఉరుతుండటం, భారీగా బురద పేరుకుపోవడంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోపక్క లోపల నుంచి వ్యర్థాలు తీసుకెళ్లే కన్వేయర బెల్టు కూడా పాడవడంతో రెస్క్యూ కష్టతరంగా మారింది. కన్వేయర్ బెల్టును పునురుద్ధరించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ లాభం లేదు. దాంతో రోబోల సహాయం తీసుకున్నారు.
Also Read : అన్నమయ్య జిల్లాలో లారీలు నుజ్జు నుజ్జు.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
టన్నెల్ లోకి రోబోలు వస్తే రెస్క్యూ వేగవంతమవుతుందని అందరూ భావించారు. కానీ దానికి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రెస్క్యూ మరింత ఆలస్యమవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యంత్రానికి సమస్యలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆశలన్నీ క్యాడవర్ డాగ్స్ పైనే పెట్టుకున్నారు అధికారులు. మరోసారి శునకాలను రంగంలోకి దింపి టీబీఎం ఆపరేటన్ మృతదేహం లభించిన ఏరియాలో గాలించనున్నారు. కాగా, ఎన్నో ఆశలు పెట్టుకున్న రోబోలు మొరాయించడంతో కుక్కలైనా మిగిలిన ఏడు డెడ్ బాడీలను గుర్తించి రెస్క్యూ ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.
Also Read: Madhya Pradesh: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన