Telangana Governor : నేడు  తెలంగాణ గవర్నర్‌గా శుక్ల ప్రమాణ స్వీకారం...ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

తెలంగాణకు కొత్త గవర్నర్‌ గా శివప్రతాప్‌ శుక్లా ను కేంద్రం నియమించింది. కాగా, ఆయన ఈ రోజు  ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు.

New Update
FotoJet (41)

Telangana Governor

Telangana Governor : తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ను కేంద్రం నియమించింది. కాగా, ఆయన ఈ రోజు  ఉదయం 11.30 గంటలకు లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొననున్నారు.

FotoJet (42)


 కాగా నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్‌ శుక్లా మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.  కొత్త గవర్నర్‌కు పూలబొకెలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన శివ ప్రతాప్ శుక్లా కు రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ రోజు రాజ్‌భవన్‌(లోక్‌ భవన్‌ )లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణస్వీకారానికి సంబంధించి రాజ్‌భవన్‌లో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  మరోవైపు, ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం తన బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. అనంతరం ఆయన మహారాష్ట్ర బయలుదేరి వెళ్లారు. ఆయనకు  బేగంపేట విమానాశ్రయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిష్ణుదేవ్ వర్మ తెలంగాణలో చేసిన సేవలను ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు