Former Minister Malla Reddy : మాజీమంత్రి మల్లారెడ్డికి షాక్... ఆ భూముల్లో సర్వే

మాజీమంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేపట్టారు. తమకు చెందిన12 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.

New Update
Mallareddy

Mallareddy

Former Minister Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి కి వరసగా షాక్‌లు తప్పడం లేదు.ఒకవైపు భూకబ్జాలపై పలువురు ఫిర్యాదులు చేస్తుండంతో కేసులు నమోదవుతుండగా, ప్రభుత్వ భూముల్లో కాలేజీలు నిర్మించారని ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టింది. ఈ వివాదాలు కొనసాగుతుండగానే కాలేజీల్లోనూ విద్యార్థులు, ఫీజూలు, నాణ్యతలేని భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలవడం మల్లారెడ్డికి పరిపాటైంది.

Also Read :  ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!

తాజాగా రెవెన్యూ అధికారులు మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేపట్టారు. తమకు చెందిన12 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో వర్సిటీలో భూ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లారు. వర్సిటీలో ఉన్న 12 ఎకరాల్లో సర్వే చేపట్టారు. మల్లారెడ్డికి వర్సిటీలో ఎంత భూమి ఉంది. ఎన్ని ఎకరాలు కబ్జా చేశారనే అంశాలపై అధికారులు సర్వే అనంతరం వెల్లడించే అవకాశం ఉంది. గతంలో మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

మల్లారెడ్డి చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి కాలేజీలు, స్కూల్స్‌ నిర్మాణం చేశారని ఆయన మీదా ఆరోపణలున్నాయి. గతంలో కాంగ్రెస్‌ నాయకులు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మేడ్చల్‌ మండలం నల్లకుంట చెరువు సర్వే నెంబరు 33లోని 13 ఎకరాల్లో మల్లారెడ్డి సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీ, సూతారి చెరువు సర్వే నెంబరు 46లోని 29 ఎకరాల విస్తీర్ణంలో సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, కోమటికుంట సర్వే నెంబర్‌ 647లోని 20 ఎకరాల్లో మల్లారెడ్డి యూనివర్సిటీ, నీలా చెరువు సర్వే నెంబరు 428లోని 5.30 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు, సర్వే నెంబరు 29లో 14.03 ఎకరాల భూమిని కబ్జా చేసి కమర్షియల్‌ నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, మల్కాజిగిరి ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా పలు చెరువులు, కుంటలు కబ్జా చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  

Also Read:   వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

మల్లారెడ్డికి యూనివర్శిటీతో కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీల పేరుతో రెండు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 6కు పైగా పాఠశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ విద్యా సంస్థల నిర్మాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి అక్రమంగా ఆక్రమించి విద్యాసంస్థలను నిర్మించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పలువురు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డిపై యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. కాలేజీ కోసం భూములు కబ్జా చేశారని కోర్టుకు వెళ్లారు. దీంతో మరోసారి మల్లారెడ్డి చర్చల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరగుతుందో చూడాలి.

Also Read: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!

Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు