/rtv/media/media_files/2026/05/01/neet-ug-2026-3-2026-05-01-18-45-01.jpg)
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన కారు గతంలోనూ చాలాసార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయి. ఈ వెహికల్ ఓనర్ పేరు బొల్లి శివ కుమార్ అని రికార్డులు చెబుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. వెహికల్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఈ కారుపై గతంలో రెండు భారీ చలాన్లు నమోదైనట్లు తెలిసింది.
Shamshabad ORR Tragedy
అందులో మొదటి చలానా 2024లోని నవంబర్ 21న ఉదయం 11.12 గంటలకు నమోదైంది. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని హంస రెస్టారెంట్ సమీపంలో ఓవర్ స్పీడ్/ డేంజరస్ డ్రైవింగ్ కారణంగా రూ.1035 చలాన్ పడింది.
అలాగే రెండో చలానా ఈ ఏడాది 2026 ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 9.47 గంటలకు నమోదైంది. తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాంపూర్ యూ-టర్న్ వద్ద మళ్లీ ఓవర్ స్పీడ్/డేంజరస్ డ్రైవింగ్ కారణంగానే మరో రూ.1035 చలాన్ పడింది.
మొత్తంగా ఈ కారుపై డేంజరస్ డ్రైవింగ్ కారణంగానే రూ.2070 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి.. ఈ వాహనం తరచూ హై స్పీడ్‌తో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అర్థం అవుతోంది. ఈ అజాగ్రత్తే ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్ల ప్రయాణికులు ట్రాఫిక్ రూల్ ప్రకారం.. తగినంత వేగంతోనే ప్రయాణించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Follow Us