/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
CM Revanth Reddy,Harish Rao
CM Revanth Reddy,Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు గౌడ్ , మల్లారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు.. గంట క్రితమే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ఇది జరిగిన కాసేపటికే ఇరువురు కలిసి ప్రొటోకాల్ అంశంపై చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని , బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యేలు హరీష్‌రావు, కేటీఆర్‌లను రేవంత్ రెడ్డి అసెంబ్లీతో పాటు, వివిధ సభల్లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ సర్కార్‌ను, రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. భిన్నదృవాలుగా ఉండే బీఆర్‌ఎస్‌నేతలు, రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమవ్వడం ఆసక్తిగా మారింది.
Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!
అయితే నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించని అంశాన్ని వారు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై రేవంత్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ నియోజకవర్గ సమస్యల విషయంలో ముఖ్యమంత్రితో అన్ని పార్టీలు తరుచూ సమావేశమవ్వడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
Also Read : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. RCB Vs KKR తొలి మ్యాచ్ రద్దు!?