TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. చర్చలు విఫలం..అర్థరాత్రి నుంచి బస్సులు బంద్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) తీసుకున్న నిర్ణయంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. రేపు తెల్లవారుజాము నుంచి రవాణా స్తంభించనుంది.

New Update
TGSRTC Express Bus

TGSRTC strike

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో మరోసారి సమ్మె గండం నెలకొంది. తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) తీసుకున్న కఠిన నిర్ణయంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చల విఫలం కావడంతో సమ్మేకు వెళ్తున్నట్లు కార్మిక సంఘాల ప్రకటించాయి. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించడంతో, ఏప్రిల్ 22 తెల్లవారుజాము నుంచి రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం కనిపిస్తోంది.

తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా అధికారులతో చర్చలు జరిపినప్పటికీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో, చివరకు సమ్మెే ఏకైక మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ వెల్లడించింది. కార్మికుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ నిరవధిక సమ్మెకు దిగుతున్నామని వారు స్పష్టం చేశారు.ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులపై తీవ్రంగా ఉండనుంది.ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండటంతో, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులపై ఆధారపడి కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు మరియు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే పల్లెటూరి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతారు. అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, ప్రైవేట్ వాహనాలపై రద్దీ పెరగడంతో పాటు, ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది.

సమ్మె నోటీసు రావడంతో, యాజమాన్యం అప్రమత్తమైంది. సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ఏవైనా అత్యవసర చర్చలు జరుపుతుందా లేదా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు, సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.సమ్మె కారణంగా రవాణా సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, అత్యవసర ప్రయాణాలకు సిద్ధమయ్యేవారు రైల్వే వంటి ఇతర రవాణా మార్గాలను ఆశ్రయించాలని సూచనలు అందుతున్నాయి. ఆర్టీసీకి సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు వార్తలను గమనిస్తూ ఉండటం మంచిది.

Advertisment
తాజా కథనాలు