/rtv/media/media_files/2025/12/11/fotojet-2025-12-11t105421251-2025-12-11-10-57-55.jpg)
Rs. 20,000 for each vote...the ongoing temptation..
Panchayat Elections : గ్రామ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మూడు విడుతలుగా జరగునున్న ఈ ఎన్నికల్లో నేడు మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. కాగా బరిలో నిలబడిన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎంతయిన ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. రాత్రికి రాత్రే ఇంటింటికి తిరుగుతూ డబ్బుల పంపిణీ షూరూ చేశారు. అనేక గ్రామాల్లో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల దాకా పంచినట్లు సమాచారం. ఒక ఇంట్లో నలుగురు ఉంటే రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా అప్పగించారు..
ఓటుకు.రూ.20 వేలు?
ఇదిలా ఉంటే తెలంగాణ పంచాయతీ ఎన్నికలో రికార్డు బ్రేకింగ్ చేసే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.15000–20000 వరకు పంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గ్రామంలో మొత్తం 4000 ఓట్లు ఉండటంతో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు పోటీ పడి మరి డబ్బు పంపిణీ చేస్తున్నారు. కాగా సాధారణ సర్పంచ్ ఎన్నికల కోసం ఏకంగా రూ.20000 పంపిణీ చేయడం చర్చనీయంశమైంది. నర్కుడ గ్రామం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉండటం. నర్కుడ చుట్టూ పక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా సాగుతుండటంతో గ్రామానికి పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టిన తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఎంతయిన ఖర్చుపెట్టడానికి అభ్యర్థులు వెనుకాడటం లేదు. కాగా సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ ఓటుకు పలుకుతున్న ధరనే అత్యధికం కావడం విశేషం. గతంలో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు రూ.15000–20000 వరకు పలికినట్లు ప్రచారం సాగింది. అయితే ఒక సర్పంచ్ ఎన్నికకు ఇంత పలకడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రికార్డు బ్రేకింగ్ వార్తగా అందరూ చెప్పుకుంటున్నారు.
పుల్ బాటిల్.. చికెన్
ఇవేకాక కొన్ని మేజర్​ పంచాయతీలు, ఆదాయం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఓటుకు రూ.5 వేల దాకా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. చాలా చోట్ల కులసంఘాల పెద్దలకు రూ.లక్షకు పైగా ఇచ్చారని తెలుస్తోంది. డబ్బులతో పాటు పలుచోట్ల తాగినోళ్లకు తాగినంత అన్నట్లుగా ఓటరుకు క్వార్టర్ నుంచి హాఫ్​ బాటిల్ దాకా, ఇంట్లో నలుగురుంటే ఫుల్​బాటిల్ మందు, చికెన్​కవర్లు కూడా పంచి పెట్టారు.
కుక్కర్..చీర..మందు
నాగర్‌కర్నూల్​ జిల్లాలోని రియల్​ఎస్టేట్​ దందా జరిగే గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేశారు. ఓ గ్రామంలో ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థి.. వెండి ఉంగరంతోపాటు ఓటుకు రూ. వెయ్యి చొప్పున అందజేశాడు.. తాండూరు మండలంలోని ఓ గ్రామంలో గుడి కట్టిస్తామని సర్పంచ్ ​అభ్యర్థి హామీ ఇచ్చాడు. బుధవారం రాత్రి గ్రామంలోని యువకులు, వృద్ధులు, మహిళలకు వేర్వేరుగా దావత్‌లు ఇచ్చాడు. కల్వకుర్తి మండలం తర్నికల్, తాండ్రలో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల వరకు ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో రిజర్వుడ్ పంచాయతీల్లో రూ.500 చొప్పున పంపిణీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల రూ.వెయ్యి నుంచి 1500 వరకు ఇచ్చారు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీలో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేలు పంపిణీ చేసినట్టు సమాచారం. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఒక అభ్యర్థి రూ. కోటి వరకు ఖర్చుచేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీకి పెద్దగా ఆదాయం లేకపోయినా పంతంతో ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లిలో ఒక అభ్యర్థి ఇంటికి ఒక కుక్కర్, మహిళా ఓటర్లకు ఒక్క చీర, కేజీ చికెన్, మందు పంచారు.
కిలో చికెన్, మహిళలకు చీరలు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ. 3 వేల చొప్పున పంపిణీ చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. 500 చొప్పున పంపిణీ చేయగా.. అదేపార్టీ కి చెందిన రెబల్ అభ్యర్థి రూ. వెయ్యి చొప్పున ఓటర్లకు పంచుతున్నారు. ఈవిషయం తెలిసి మొదటి అభ్యర్థి మరో రూ.500 చొప్పున కొందరికి ఇచ్చినట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లా చెల్పూర్, గణపురం, మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట, ఆకినపల్లిలో అభ్యర్థులు ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంచినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇదే మండలంలోని చాలా గ్రామాల్లో ఇంటికి కిలో చొప్పున చికెన్, మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేయడం గమనార్హం.
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా సర్పంచ్​ పదవికి ముగ్గురు పోటీలో ఉండగా.. ఇద్దరు ఓటుకు రూ. 500 చొప్పున ఇచ్చారు. చామన్ పల్లిలోనూ ఇద్దరు అభ్యర్థులు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఖానాపూర్ మండలం లోని మస్కాపూర్, సూర్జపూర్, ఎర్వాచింతల్, రంగంపేట గ్రామాల్లో అభ్యర్థులు ఇంటింటికీ మద్యం బాటిళ్లు పంపించారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్, కొత్తపల్లి, కొత్తకొండ, గట్ల నర్సింగాపూర్, రత్నగిరి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. వార్డు మెంబర్ అభ్యర్థులు ఓటుకు రూ.200 చొప్పున పంచారు. పురుష ఓటర్లకు అదనంగా క్వార్టర్​బాటిళ్లు అందజేశారు. ఇలా రాష్ర్ట వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. రెండవ, మూడవ విడత ఎన్నికల కోసం కూడా ఈ ప్రలోభాలు కొనసాగుతున్నాయి.
ఆగని వేలం పాటలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు జోరుగా వేలం జరుగుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఆయా పదవులను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో సర్పంచి పదవిని రూ.52 లక్షలు, ఉప సర్పంచి పదవిని రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్‌లో సర్పంచి పదవికి రూ.45 లక్షలు, ఉప సర్పంచికి రూ.10 లక్షలు పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటికీ డబ్బుతో పాటు గ్రామంలో దేవాలయాలు, పంచాయతీ భవనాలకు స్థలాలు ఇస్తామంటూ అభ్యర్థులు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లింగంపేట మండలంలో ఏకగ్రీవమైన 14 పంచాయతీల్లో పదింటిదీ ఇదే పరిస్థితి. లింగంపేట మండలం నుంచి గాంధారికి వెళ్లే మార్గంలోని ఓ తండాలో సర్పంచి అభ్యర్థి 4 గుంటల భూమిని గ్రామ పంచాయతీ భవనానికి, ఉప సర్పంచి అభ్యర్థి 2 గుంటల భూమిని అంగన్‌వాడీ భవనానికి రాసిచ్చారని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న మరో గ్రామంలో 8 వార్డులకు గాను మూడింటిని రూ.50 వేల చొప్పున వేలం వేశారు. 700 మంది జనాభా ఉన్న ఓ తండాలో సర్పంచి పదవిని రూ.16.5 లక్షలకు కొనుగోలు చేశారు. పదవుల మోజులో ఇంత భారీగా ఖర్చు చేయడం చూసి స్థానికులే విస్తుపోతున్నారు.
డబ్బుల సంచులు దొరుకుతున్నాయి
ఎన్నికల వేళ కొనసాగుతున్న ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ (మం) అక్కారం బస్టాప్ వద్ద కారులో తరలిస్తున్న 2 లక్షల 25 వేల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న డబ్బులు జగదేవ్ పూర్ సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థివిగా అనుమానిస్తున్నారు. మరోవైపు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూ.6.04 లక్షల నగదు, 120 కేసుల్లో సుమారు రూ.10.69 లక్షల విలువైన మద్యం సీసాలు పట్టుకున్నారు.
పైసలు పంచ.. మందు తాప..సర్పంచ్ క్యాండిడేట్ వినూత్న బోర్డు
‘పైసలు పంచ.. మందు తాప.. నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి’ అంటూ ఓ సర్పంచ్ క్యాండిడేట్​తన ఇంటిముందు బోర్డు పెట్టేశారు. ‘మేం ఓట్లు కొనం..’ అంటూ ముఖం మీదే చెప్పేయడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన పి. మైత్రేయి సర్పంచ్ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్నారు. రెండు రోజుల కింది వరకు జోరుగా ప్రచారం చేశారు. క్యాంపెయిన్​ గడువు ముగియడంతో కొందరు ఓటర్లు, నాయకులు ఆమె వద్దకు వెళ్లి ‘మాకు ఏమైనా ఇవ్వాలి’ అని అడిగారు. దీంతో విసుగెత్తుకొచ్చిన ఆమె ఇంటిముందు ఇలా బోర్డు పెట్టారు.
Follow Us