/rtv/media/media_files/2026/02/27/kavita-and-kejriwal-2026-02-27-11-42-52.jpg)
Kavita and kejriwal
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది. ఈ కేసులో కవితకు పూర్తిస్థాయిలో క్లీన్చిట్ ఇస్తున్నట్లు పేర్కొంది. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కోర్టు కేసులు కొట్టివేసింది. వాళ్లందరి పేర్లు డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా ఈ కేసులో వాళ్ల పేర్లు ఇరికించినట్లు మండిపడింది. మొత్తంగా ఈ కేసులో అభియోగాలు మోపిన 22 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: కలెక్టర్ ట్రాన్స్ఫర్.. సంబురాలు చేసుకున్న జనం..ఎక్కడో తెలుసా?
గత రెండేళ్లుగా ఈ కేసుపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కవిత, కేజ్రీవాల్, సిసోడియా బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చారు. తాజాగా కోర్టు వారిపై ఉన్న కేసు కొట్టివేయడంతో వాళ్ల అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఫాల్కన్ గ్రూప్ మాజీ సీఓఓ వికాస్ కుమార్ సఖారే అరెస్ట్
2021, నవంబర్ 17న ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో 2022 సెప్టెంబర్‌లో ఈ పాలసీని రద్దు చేసింది. ఇందులో ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీలో సవరణలు చేసేటప్పుడు వీళ్ల అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేశాయి. లైసెన్స్ కావాలనుకునే వారినుంచి అక్రమంగా నగదు తీసుకున్నట్లు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై నుంచి విడుదలయ్యారు.
Follow Us