TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిరాశ ఎదురయ్యే అవకాశముంది. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా.. మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

New Update
sanna biyyam

Telangana:

తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. తాజాగా మూడు నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 

Also Read: Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి..

ఖరీఫ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్‌ చేస్తే... బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని, నాణ్యత లోపిస్తుందని నిపుణులు సూచించినట్లు ఆయన తెలిపారు. కనీసం మూడు నెలలపాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: TTD: రెండు మూడు గంటల్లో  శ్రీవారి దర్శనం ఎలాగో తెలుసా!

ఈ నేపథ్యంలో సన్న బియ్యాన్ని ఎస్‌పీఆర్‌జీల్లో (స్టేట్‌ పూల్‌ రిజర్వు గోడౌన్లలో)నిల్వ చేసి, మూడు నెలల తర్వాత ఉగాది నుంచి రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు వివరించారు. మరోవైపు.. సన్న బియ్యం పంపిణీ పథకానికి నెలకు 2లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరంఉంటుంది. అంటే.. 36 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం పెద్దగా రావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 3 లక్షల టన్నులే వచ్చాయి. 

Also Read: Pawan: పవన్ కు భారీ ఊరట.. క్రిమినల్ కేసులో ...కోర్టు కీలక ఆదేశాలు!

రైతులు బహిరంగ మార్కెట్లోనే సన్నాలను అమ్ముకుంటున్నారు. సీజన్‌ ప్రారంభంలో కొనుగోలు కేంద్రాలకు 50 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత 40 లక్షల టన్నులే వస్తుందని స్పష్టం చేసింది. తాజాగా 35లక్షల టన్నులు వస్తుందనే అంచనాతో ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో సన్నబియ్యం పంపిణీకి సరిపోయేలా ధాన్యం వస్తుందా? లేదా? అనే సందేహాలున్నాయి. ఒకవేళ లక్ష్యానికి అనుగుణంగా సన్న ధాన్యం రాకపోతే సన్న బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే.

Also Read: Lemon: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు

అదే జరిగితే... మళ్లీ టెండర్లు పిలవడం, రైస్‌మిల్లర్ల నుంచి ప్రొక్యూర్మెంట్‌ చేయటం వంటి పనులుంటాయి. ఈ కారణాల రీత్యానే సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం మూడు నెలల పాటు వాయిదా వేసిందనే చర్చ నడుస్తుంది. ఈ మేరకు ఉగాది పండుగ రోజు (వచ్చే ఏడాది మార్చి 30)న పఽథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఏప్రిల్‌ నెల కోటాలో సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment