Konda Sushmita : రేవంత్ మనిషిపైనే పోటీ చేస్తా.. కొండా సుష్మిత సంచలన స్టేట్మెంట్.. తండ్రి మురళి ముందే..!-VIDEO

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా దంపతుల మధ్య గతంలో ఏర్పడిన వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో కొమ్మల జాతర వేదికగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఈసారి వివాదం పరకాల నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది.

New Update
FotoJet

Konda Sushmita's sensational statement.. in front of father Murali.

Konda Sushmita : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా దంపతుల మధ్య గతంలో ఏర్పడిన వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో కొమ్మల జాతర వేదికగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఈసారి వివాదం పరకాల నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. నిజానికి కొండా సురేఖ మొదట శాయంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వస్థీకరణలో భాగంగా పరకాల నుంచి పోటీ చేశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సురేఖ వరంగల్ తూర్పునుంచి పోటీ చేస్తున్నారు. అయితే పరకాల నియోజకవర్గాన్నే కొండా దంపతులు తమ ప్రధాన నియోజకవర్గంగా పేర్కొంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం పరకాల నియోజకవర్గం నుంచి సురేఖ కూతురు సుస్మితకోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ వారికి టికెట్ కేటాయించలేదు. ఈ స్థానాన్ని రేవూరి ప్రకాశ్ రెడ్డికి కేటాయించగా ఆయన విజయం సాధించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి రేవంత్‌ రెడ్డితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు రేవంత్ రెడ్డి పరకాల స్థానాన్ని కేటాయించారు. అయితే ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి అయిన రేవూరి పరకాలలో విజయం సాధించడం కొండా సురేఖ దంపతులకు మింగుడు పడని అంశం. ఈ విషయంలో అవకాశం దొరికిన ప్రతిసారి పరకాలలో పర్యటించడమే కాకుండా అక్కడ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కొండా దంపతులు. గతంలో ఒకసారి ఈ విషయంలో వివాదం చెలరేగగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో రేవంత్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. తాజాగా కొమ్మల జాతర సందర్బంగా కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

పరకాల నా అడ్డా...నా కూతురు పోటీ చేయడం ఖాయం : కొండా మురళి


వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో హోలీ సందర్బంగా ప్రతి ఏడాది  ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అలంకరించిన ప్రభల బండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేలాది భక్తుల మొక్కులతో పరిసరాలు హోరెత్తుతాయి. ప్రభలతో పాటు పాల్గొన్న కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత కార్యకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మురళి మాట్లాడుతూ


'పరకాల నా అడ్డా.. వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పరకాల నుంచి పోటీ చేయడం ఖాయం' అంటూ మురళి తేల్చి చెప్పారు. సుస్మిత ధైర్యవంతురాలు అని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరినైనా ఎదుర్కొంటుందనిరొండా మురళి  పేర్కొన్నారు. అటు సుష్మిత సైతం.. పరకాల నుంచే తన రాజకీయ ప్రస్తానం కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు.కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుండే మొదలైందన్న ఆమె నేను కూడా పరకాల నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతాను అంటూ కుండ బద్దలు కొట్టారు.

రేవంత్ రెడ్డికి సవాల్

కాగా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఆయనతో పాటే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో ఆయన ప్రకాశ్ రెడ్డిని కాదని సుశ్మితకు అవకాశం ఇస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి  కొండా దంపతులకు రేవంత్ రెడ్డితో మొదటి నుంచి అంత సఖ్యత లేదనే చెప్పాలి. గతంలోనూ కొండా కు రేవంత్ రెడ్డికి మధ్య వివాదాలు తలెత్తాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ వేములవాడ గోవుల దత్తత విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. 

అనంతరం దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం టెండర్లలో ఇంచార్జి మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవటంతో ఆ శాఖకు చెందిన మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.71కోట్ల టెండర్ ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నాడని.. శాఖకు మంత్రిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్ని తానై పొంగులేటి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం ఏమిటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పొంగులేటి తీరుతో తనకు ఇబ్బందిగా ఉందని అధిష్టానంకు లేఖ రూపంలో కొండా మురళి ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ సుమంత్ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసే విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.కొండా తోపాటు ఆమె కూతురు కూడా సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో కొండా సురేఖను మంత్రిపదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో సుస్మిత సైతం రేవంత్ రెడ్డితో పాటు పోలీసులను తీవ్రస్థాయిలో ఆక్షేపించారుజ.ఓ కేసు విషయంలో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని గుమ్మంలోనే నిలబెట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.  ఈ విషయంలోనూ కొండాకు రేవంత్ కు వివాదం ముదిరింది. అయితే ఆ తర్వాత ఎఐసీసీ, పీసీసీ జోక్యంతో వివాదం సద్దమణిగింది. తాజాగా మరోసారి పరకాల అంశంపై మురళి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు