CM Revanth Reddy : జూన్ 15 తర్వాత తేల్చుకుంటాం.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

New Update
cm revanth reddy

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూన్ 15 లోపు కేంద్రం స్పందించకపోతే నేరుగా బీజేపీ ఆఫీస్ ముందే తేల్చుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 75 లక్షల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొనే ఈ పంటను, కేంద్రం సేకరించాల్సిన బాధ్యత ఉంది. సత్రంలో పెట్టే భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అవసరం లేదు. అలాగే, రాష్ట్రం కొనే పంటను కేంద్రం తీసుకునేలా చేయడం కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకోవాలి.వడ్లతో పాటు జొన్నలు, మొక్కజొన్నలు కూడా కేంద్రం ఖచ్చితంగా కొనాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటను తీసుకోకపోతే.. జూన్ 15 తర్వాత మా కార్యాచరణ ఏంటో చూపిస్తాం. రైతుల ధాన్యాన్ని తీసుకెళ్లి నేరుగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసు ముందే పోసి తేల్చుకుంటాం. ఈ బాధ్యతను కిషన్ రెడ్డి తీసుకోకపోతే ఆయన రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి వస్తుంది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కిషన్ రెడ్డి చొరవ చూపాలి

ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాల తీరును సీఎం తప్పుబట్టారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై స్పందించారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణకు చెందిన 7 మండలాలను తీసుకెళ్లి ఏపీలో కలిపారు. మరి మన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 వేల ఎకరాల భూమిని ఇవ్వలేదా?" అని ప్రశ్నించారు.  తుమ్మిడిహెట్టి భూముల విషయమై తాను ఎన్ని లేఖలు రాసినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి, మహారాష్ట్ర సీఎం మహాయుతి ప్రభుత్వంతో మీటింగ్ ఏర్పాటు చేయించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు