/rtv/media/media_files/2025/01/31/gyLqlOsBC4iaUCitsT0g.jpg)
Revanth Reddy Vs KCR
సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేసిన జీవన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇస్తే జీవన్ రెడ్డి చూసి ఓర్వలేక పోయారని ముఖ్యమంత్రి విమర్శించారు. పదవుల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారని.. కేసీఆర్ జీవన్ రెడ్డికి పదవి ఇవ్వకపోవడం కాదు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పదవే లేకుండా ఓడిస్తా అని రేవంత్ శపథం చేశారు. 2029 ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా పోగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. 2023 ఎన్నికల్లో జగిత్యాల టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి నెత్తిమీద దరిద్రం ఉండి ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలని జీవన్ రెడ్డి కోరుకుంటున్నారని సీఎం చెప్పారు. ఒక్క ఏడాది పదవి లేకుంటే జీవన్ రెడ్డి 40ఏళ్లు అండగా ఉన్న పార్టీ, కార్యకర్తల్ని వదిలి శ్రతువుల పక్క చేరుతున్నారని ఆరోపించారు. పెడితే పెళ్లి, పెట్టకుంటే చావు కోరుకునే తీరు జీవన్ రెడ్డిది అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
నీకు సిగ్గు శరం ఉందా జీవన్ రెడ్డి?
— Mirror TV (@MirrorTvTelugu) April 20, 2026
జీవన్ రెడ్డిపై విషం చిమ్మిన రేవంత్ రెడ్డి pic.twitter.com/zDsPK7lVuq
జీవన్ రెడ్డి లాంటి కర్కోటక నాయకుడిని తాను చూడలేదని తెలంగాన సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి వల్ల ప్రజా ప్రభుత్వం రాలేదని, జగిత్యాలలో ఓడినా ఆయనను గౌరవించామని పేర్కొన్నారు. మంత్రి పదవి రాలేదన్న సాకుతో శత్రువులతో చేతులు కలిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు 40 ఏళ్లుగా సేవ చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం పోవాలని కోరుకోవడం స్వార్థమేనని రేవంత్ విమర్శించారు. పదవి రాకుంటే ప్రభుత్వం పోవాలని కోరుకుంటావా అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో ఘోరి కట్టామని అన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టుల పేర్లు, ఊర్లు, అంచనాలు మార్చి లక్షల కోట్లు మాయం చేశారని ఆరోపించారు. సొంతలాభం కోసం పార్టీ మారిన జీవన్ రెడ్డి ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్నారని.. ఎందుకు పోవాలో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Follow Us