/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Dharani-jpg.webp)
Dharani Issue: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యల పరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల ప్రజాపాలన కింద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ధరణి పోర్టల్ కు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాదాపు లక్షకు పైగా ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కార బాధ్యతలకు అదనపు కలెక్టర్ కు అందించింది.
ధరణి బదులుగా భూదేవి...
ఎన్నికల సమయంలోనూ ఆనాడు ప్రతిపక్షలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధరణి పోర్టల్ పై అనేక ఆరోపణలు చేశాయి. ధరణి పోర్టల్ ఒక ప్రవేట్ కంపెనీ వ్యక్తులతో ఎలా నడుపుతారని విమర్శలు చేసింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను రికార్డులు డిజిటల్ చేయడం కోసం, రిజిష్రేషన్స్ ను సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు తలెత్తితే.. దాని పరిష్కార బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.
అయితే.. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు తగ్గడం పక్కకి పెడితే పెరుగుతున్నాయని.. భూములను సులభంగా కొట్టేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ ను తెచ్చిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటన చేసింది. ధరణి పోర్టల్ బదులుగా భూదేవి పోర్టల్ ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి సమస్యల పరిష్కారం, భూదేవి పోర్టల్ అమలు వంటి వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో భూదేవి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.