/rtv/media/media_files/2025/03/28/tooUU9Nxf7R819MljJMo.jpg)
Ramagundam mla Raj Thakur
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూ ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయాయి. పలు భవనాలు కూలిపోయాయి. వీటి కింద చాలా మంది చిక్కుకుపోయారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగవచ్చని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అవుతున్నాయి. మరోవైపు మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వేలల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి.
తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే..
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబానికి బ్యాంకాక్ లో ప్రాణాపాయం తప్పింది. ఆయన కుటుంబం ప్రస్తుతం థాయ్ లాండ్ పర్యటనలో ఉన్నారు. రాజ్ ఠాకూర్, ఆయన భార్య, కూతురు, అల్లుడు అందరూ బ్యాంకాక్ లో ఉన్నారు. ఈరోజు అక్కడ భూకంపం సంభవించగా వారు ఉంటున్న హోటల్ కూడా కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు అంతకు కొద్ది నిమిషాల ముందే వారందరూ హోటల్ నుంచి బయటకు వెళ్ళారు. దీంతో రాజ్ ఠాకూర్ కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం వారందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. తొందరలోనే అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చేయనున్నారు.
today-latest-news-in-telugu | ramagundam | mla | Earthquake in Bangkok
Also Read: DA Hike: ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..డీఏ పెంపు