/rtv/media/media_files/2025/04/13/mtQV4lkO9SFnFBRxe2ic.jpg)
Raj Gopal Reddy
Komatireddy Raj Gopal Reddy : గత కొంతకాలంగా తనకు మంత్రి వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దూకుడు పెంచారు. ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానానికి స్పష్టం చేశాడు. అంతేకాదు ఆయనకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా తోడవ్వడంతో ఆయన మంత్రి పదవి ఆసక్తికరంగా మారింది.చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది’ అని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ఇక ఆయనకు మద్దతుగా మాట్లాడిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మేమంతా రాజగోపాల్ రెడ్డి కోసం ఎక్కడ సంతకం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని మేము భావిస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మీద విజన్, సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
వారితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను పెద్ద పాపులర్ పర్సన్ కాదు. పార్టీలో కింది స్థాయి నుంచి కష్టపడితే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నా గెలుపును తన భుజాల మీద వేసుకొని గెలిపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి లేకపోతే నా గెలుపు అంత సులువు అయ్యేది కాదు. తనను ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి క్రియాశీలక పాత్ర రాజగోపాల్ రెడ్డిది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని చామల కిరణ్ డిమాండ్ చేశారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
గత కొంతకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నది. సామాజిక వర్గాల సమన్వయం, అన్ని జిల్లాలకు ప్రాథినిత్యం లభించాలనే కోణంలో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ కు మంత్రుల ఎంపిక సవాలుగా మారింది. మరోవైపు జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.