Temperature: నడినెత్తిన నిప్పుల వర్షం..46 డిగ్రీలు దాటిన ఉష్ణ్రోగ్రత..నలుగురు మృతి

రోహిణి కార్తె రాకముందే తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును తాకడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు మృతి చెందటం విచారకరం.

New Update
Temperature

Temperature

Temperature: రోహిణి కార్తె రాకముందే తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును తాకడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా 45.9 డిగ్రీల మేర ఎండలు దంచికొట్టాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ పలుచోట్ల 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

ఈ తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లాలో భోగారపు మారయ్య (56), పెద్దపల్లి జిల్లాలో దశరథం సౌమ్య (19), నారాయణపేట జిల్లాలో ఒక వృద్ధుడు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో పొలంలో పని చేస్తున్న కుర్మ రంగు జంగయ్య (51) అనే రైతుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీలు అధికం కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే, భానుడి భగభగలతో పాటు రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వడగాల్పులు వీస్తుండగానే, మరోవైపు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో పాటు కొన్నిచోట్ల వడగళ్ల వాన (Hails) పడే అవకాశం ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

హైదరాబాద్ వాసులకు కూడా నేడు మధ్యాహ్నం నుండి రాత్రి లోపు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, అక్కడక్కడా వడగళ్లు కూడా పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న రంగారెడ్డి జిల్లాలో కురిసిన వడగళ్ల వానకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు