Harish Rao : ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాజీ మంత్రి మాట్లాడుతూ.. కనీసం 20 రోజులు అసెంబ్లీ నడపాలని బీఏసీలో డిమాండ్ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామని తెలిపారు. సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారన్నారు. రైతాంగ సమస్యలు, తాగు సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరామని.. వివిధ ప్రాజెక్టులు(సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం, ఎస్ఎల్బీసీ ప్రమాదం) కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరామన్నారు.
Also Read: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల వినియోగంలో విఫలం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఏసీలో చెప్పామన్నారు. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలని, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశామన్నారుర. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పామన్నారు. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. మాజీ సర్పంచ్ లు,చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులపై కూడా సభలో చర్చించాలని కోరామని హరీష్ రావు తెలిపారు.
Also Read : హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే
సభ సమావేశాలు 11 రోజులే..
తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ పనిదినాలపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 19న బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రేపు (గురువారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దానిపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అలాగే 14న హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు. 16న ఆదివారం. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చించనున్నారు.
Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ జరుగనుంది. 19న బడ్జెట్‌ను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 21న బడ్జెట్‌పై చర్చించనున్నారు. అలాగే మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 27న ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. దాదాపు 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. కనీసం 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ దృష్టికి బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. అయితే ఈనెల 27 వరకు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుండి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
Harish Rao : క్వశ్చన్ పేపర్ లీక్..హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు
ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు..అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాజీ మంత్రి మాట్లాడుతూ..కనీసం 20 రోజులు అసెంబ్లీ నడపాలని బీఏసీలో డిమాండ్ చేశామని తెలిపారు.
T. Harish Rao