/rtv/media/media_files/2025/03/29/bWrogfZ66pO0TSm5d6f6.jpg)
Pushkaralu
Pushkaralu : తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారులు పనులు ప్రారంభించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ, టూరిజం, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులు ఇటీవలే ప్రయాగ్ రాజ్ కు వెళ్లి కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించారు.
Also read : చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!
అక్కడి అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన నివేదికను సీఎం కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ ఏడాది మహా సరస్వతి పుష్కరాలు రానున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు సూచనలు ఇచ్చింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రూ.25 కోట్లు మంజూరు చేసింది.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఈ పుష్కరాలకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన మహా కుంభమేళాపై అధికారులతో ప్రభుత్వం సర్వే చేయించింది. రాష్ట్రం నుంచి ఎండోమెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో పర్యటించింది. అక్కడి అధికారులతో మాట్లాడి కుంభమేళా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన నివేదికను రాప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం రెండేండ్ల ముందుగానే కుంభమేళా ఏర్పాట్లను ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహించాలని చూస్తున్నది. ప్రభుత్వం నుంచి సిగ్నల్ రాగానే పుష్కరాలకు పనులు ప్రారంభించనున్నారు.
Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
మూడేండ్లలో మూడు నదులకు పుష్కరాలు రానుండంతో అందకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరుసగా పుష్కరాలు వస్తుండంతో రాష్ట్ర్ంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది.
Also read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!