/rtv/media/media_files/2025/01/27/VlEBcJGT49ANPDUNsJBE.jpg)
Munirabad Murder Case
Medchal Murder Case : ఈనెల 24న మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన విధితమే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నాలుగు బృందాలతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పలు రకాల క్లూస్ సాధించినట్లు సమాచారం. ఇందులో భాగంగా హత్యకు గురైన మహిళ బోధన్ కు చెందిన శివానంద (25) గా గుర్తించినట్లు సమాచారం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చిన మహిళ. ఇళ్లలో పనిచేస్తూ మరో వ్యక్తితో నివసిస్తుందని సమాచారం. మహిళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లా కమలాపుర్ గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలోఈ నెల 24న 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఎవరూ, ఇక్కడకు ఎలా వచ్చిందీ, ఎవరితో వచ్చిందీ తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తూ నిందితుల వివరాలను గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసులను సమీక్షిస్తున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బై పాస్ అండర్ బ్రిడ్జి కింద యువతి దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నామని తెలిపారు. 25–30సంవత్సరాలు ఉంటే యువతి దారుణ హత్యకు గురైందన్నారు. తలపై రాయితో మోది ముఖం గుర్తుపట్టడానికి లేకుండా పోయిందని, అంతేకాకుండా.. నిప్పటించిన వల్ల మొహం మొత్తం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు, క్లూస్ టీమ్ఆస్ ధారాలను సేకరిస్తున్నారని, మని అని యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్ లో టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.